మినహాయింపులు మరియు ఆక్షేపణలు నమూనా క్లాజులు

మినహాయింపులు మరియు ఆక్షేపణలు. 5.25 5.25.1 Debit Card ని అంగీకరించకపోవడం మేము ఏ విధముగానూ బాధ్యులము కాము: a. మీ Debit Card(లు) లేదా PIN(లు)ను వ్యాపారి లేదా Debit Card లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి ఉపయోగించే ఏదైనా టెర్మినల్ తిరస్కరించితే లేదా ఏదైనా Debit Card లావాదేవీకి అధికారం ఇవ్వడానికి మేము ఏ కారణం చేతనైనా నిరాకరిస్తే; b. Debit Card లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి ఉపయోగించే ఏదైనా టెర్మినల్లో ఏదైనా పనిచేయకపోవడం, లోపం లేదా ఇతర యంత్రాలు లేదా మాచే లేక ఇతర వ్యక్తులునిర్వహించే అధికార వ్యవస్థ లో లోపం; c. ఈ ఒప్పందం ప్రకారం మా బాధ్యతలను నిర్వర్తించడంలో ఏదైనా ఆలస్యం లేదా అసమర్థత జరిగినా లేదా ఏదైనా యంత్రం, డేటా ప్రాసెసింగ్ సిస్టమ్, ట్రాన్స్మిషన్ లింక్ లేదా ఉత్పన్నమయ్యే వైఫల్యం లేదా ఏదైనా అనధికారిక మరియు/లేదా చట్టవిరుద్ధమైన యాక్సెస్ వల్ల అలాంటి ఆలస్యం లేదా అసమర్థత ఏర్పడినట్లయితే ఏదైనా ఎలక్ట్రానిక్, మెకానికల్ సిస్టమ్, డేటా ప్రాసెసింగ్ లేదా టెలికమ్యూనికేషన్ లోపం లేదా వైఫల్యం, విద్యుత్ వైఫల్యం, దేవుని చర్య, పౌర భంగం, యుద్ధం లేదా యుద్ధపరమైన శత్రుత్వం, పౌర కల్లోలాలు, అల్లర్లు, దిగ్బంధనాలు, నిషేధాలు, విధ్వంసం, సమ్మెలు, లాకౌట్లు, అగ్నిప్రమాదం, వరదలు , మెటీరియల్ లేదా కార్మికుల కొరత, సబ్-కాంట్రాక్టర్ల నుండి డెలివరీలలో జాప్యం లేదా మా నియంత్రణలో లేని ఏదైనా సంఘటన లేదా మా ఏజెంట్లు లేదా కాంట్రాక్టర్ల నియంత్రణ లేని ఏదైనా మోసం లేదా ఫోర్జరీ; d. మీ Debit Card లో లేదా మీ Debit Card లోని ఏదైనా మైక్రోచిప్ లేదా సర్క్యూట్ లేదా పరికరంలో నిల్వ చేయబడిన ఏదైనా డేటా లేదా సమాచారాన్ని తిరిగి పొందడంలో ఏదైనా నష్టం లేదా అసమర్థత; e. ఎలక్ట్రానిక్ సేవలకు సంబంధించి మా సమ్మతి కోసం మీరు అందించిన లేదా మీ చే అందించబడిన ఏదైనా సూచనలతో, అటువంటి సూచనలో పొందుపరిచిన సమాచారం యొక్క సమగ్రత ప్రసారం సమయంలో రాజీ పడవచ్చు లేదా బలహీనపడి ఉండవచ్చు, అయితే అటువంటి సూచనను స్వీకరించే సహేతుకమైన వ్యక్తికి అలాంటి రాజీ లేదా బలహీనత స్పష్టంగా కనిపించక పోయే అవకాశం లో; f. మా మరియు/లేదా ఎవరైనా పాల్గొనేవారి ఏదైనా చర్య ఫలితంగా మీరు ఏదైనా ఎలక్ట్రానిక్ సేవలను ఉపయోగించ వీలు కాకుంటే; లేదా g. సిస్టమ్ నిర్వహణ లేదా విచ్ఛిన్నం/ నెట్వర్క్ అందుబాటులో లేకపోవడం వల్ల ఏదైనా ఎలక్ట్రానిక్ సేవ అందుబాటులో లేకపోతే; లేదా h. ఏవైనా పరికరాలు లేదా ఎవరైనా సాఫ్ట్వేర్ ప్రొవైడర్లు, సర్వీస్ ప్రొవైడర్, నెట్వర్క్ ప్రొవైడర్లు (టెలీకమ్యూనికేషన్స్ ప్రొవైడర్లు, ఇంటర్నెట్ బ్రౌజర్ ప్రొవైడర్లు మరియు ఇంటర్నెట్ యాక్సెస్ ప్రొవైడర్లతో సహా పరిమితి లేకుండా), ఎవరైనా పాల్గొనేవారు లేదా పైన పేర్కొన్న వాటిలో ఏదైనా ఏజెంట్ లేదా సబ్కాంట్రాక్టర్. ఏది ఏమైనప్పటికీ,మా స్థూల నిర్లక్ష్యం లేదా ఉద్దేశపూర్వక ఉపేక్ష మినహాయించి ఏ సందర్భంలోనైనా, తప్పు జరిగినా లేదా చేయవలసిన పని జరగకపోయినా దేనికీ మా బాధ్యత లేదు. 5.25.2