కమ్యూనికేషన్ నమూనా క్లాజులు

కమ్యూనికేషన్. మేము మీకు Debit Card సంబంధిత నోటీసులు, ఖాతా స్టేట్మెంట్లు లేదా ఏదైనా ఇతర కమ్యూనికేషన్ను యాప్లో సందేశాలు, ఫాక్సిమైల్ ట్రాన్స్మిషన్, షార్ట్ మెసేజ్ సిస్టమ్ (యస్ యం యస్) (SMS), ఎలక్ట్రానిక్ మెయిల్, సాధారణ ప్రీపెయిడ్ పోస్ట్ లేదా మా రికార్డ్లలోని మీ నమోదిత ప్రస్తుత చిరునామాకు వ్యక్తిగత డెలివరీ ద్వారా పంపవచ్చు. యాప్లో సందేశాలు/ఫాక్సిమైల్/ (యస్ యం యస్)SMS/ఇమెయిల్ ద్వారా పంపబడిన కమ్యూనికేషన్ మరియు నోటీసులు క్యారియర్ ఆలస్యంతో సంబంధం లేకుండా అదే రోజున పంపినట్లు మరియు మీరు స్వీకరించినట్లు పరిగణించబడతాయి. ప్రీ- పెయిడ్ మెయిల్ ద్వారా పంపిన కమ్యూనికేషన్ మరియు నోటీసులు భారతదేశంలో పోస్ట్ ద్వారా పంపినట్లయితే పోస్ట్ చేసిన తేదీ తర్వాత వెంటనే డెలివరీ చేయబడినట్లు పరిగణించబడతాయి మరియు భారతదేశం వెలుపలకు పంపినట్లయితే పోస్ట్ చేసిన తేదీ నుండి ఐదు (5) రోజుల తర్వాత డెలివరీ చేయబడినట్లు పరిగణించబడతాయి. . ప్రస్తుతానికి, Debit Card లింక్ చేయబడిన digibank యాప్లో కమ్యూనికేషన్ అందుబాటులో ఉంటుంది. 5.28.2